విధాత, హైదరాబాద్ : సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన సాయి కిరణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించి అభినందించారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటుతూ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారని కొనియాడారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సివిల్ ర్యాంకర్ ..సాయి కిరణ్
