విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు గురువారం ఇండో యుఎస్ కంపెనీల స్ట్రాటజిక్ పాట్నర్ షిప్ ఫోరం ప్రతినిధులతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. డిసెంబర్ 8, 9న హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి వారిని సీఎం ఆహ్వానించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్బంగా కాంగ్రెస్ హైకమాండ్ నేతలను, రాష్టాభివృద్ది పనులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తారా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
