Site icon vidhaatha

CM Revanth Reddy | డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నుంచి ఆగస్టు 5 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలకు హాజరవుతోన్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. అలాగే 2012 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జరుగుతోన్న ఈ డీఎస్సీ ద్వారా మీ కలలు ఫలించాలని ఆకాంక్షించారు. ఇక భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 11 వేల పై చిలుకు పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. గురువారం నుంచి అభ్యర్ధులకు రెండు షిఫ్ట్ లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ఆగస్ట్ 5 వరకు జరగనున్నాయి. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కొంతకాలంగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం ససేమిరా అంది. పరీక్షల వాయిదా కుదరదని, త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీనిచ్చింది. మరోవైపు డీఎస్సీ వాయిదా కోరుతు కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించినప్పటికి ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వాహణ కొనసాగిస్తుంది.

Exit mobile version