Rajiv Yuva Vikasam Scheme | తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి( Rajiv Yuva Vikasam Scheme )సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. తొలి విడుతలో కేవలం రూ. లక్ష లోపు రుణాలు మాత్రమే మంజూరు చేయాలని సీఎం రేవంత్( CM Revanth ) సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే కేటగిరి 1, 2 యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు నిధులు మంజూరు చేయనుంది ప్రభుత్వం. కేటగిరీ 1, 2 యూనిట్ల కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి రూ. 1,100 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు వేసింది. కాబట్టి ఈ రెండు కేటగిరీల్లోని లబ్దిదారులకు తొలి విడుతలో ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కేటగిరీలకు రెండు, మూడు విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
రాజీవ్ యువ వికాసం పథకానికి(Rajiv Yuva Vikasam Scheme ) అన్ని యూనిట్లకు, అన్ని వర్గాల నుంచి 16.23 లక్షల మంది నిరుద్యోగ యువకులు( Un Employees ) దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కోసం నెలకు రూ. 2 వేల కోట్ల చొప్పున మూడు దఫాలుగా రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కేటగిరీ 1 యూనిట్లు మినహా మిగతా కేటగిరీ 2, 3, 4 యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి.
కేటగిరీ 1 కింద రూ. 50 వేల లోపు రుణాలను నూరు శాతం గ్రాంట్‌గా ఇస్తోంది. కేటగిరీ 1లో 1.58 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించగా, 39,401 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కేటగిరీ 2లో భాగంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష లోపు 1.22 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా, 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన సమీక్షలో ఈ రెండు కేటగిరీల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేటగిరీ-2 కింద యూనిట్ వ్యయంలో 10 శాతం (రూ. లక్ష వరకు), కేటగిరీ-3 కింద 20 శాతం (రూ. లక్ష నుండి రూ. 2 లక్షల వరకు), మరియు కేటగిరీ-4 కింద 30 శాతం (రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు) బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేసింది.