Site icon vidhaatha

MP Chamala Kiran Kumar | ఇంట్లో కూర్చున్న వ్యక్తికి పిలిచి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు : కాంగ్రెస్‌ ఎంపీ చామల సెటైర్‌

MP Chamala Kiran Kumar | తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలుకంటున్న బీజేపీ పార్టీ చివరకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికను కూడా సక్రమంగా చేసుకోలేకపోయిందంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీలో అధ్యక్షపదవికి పోటీ త్రీవంగా ఉందని చెప్పి..ఇంటి దగ్గర కూర్చున్న వ్యక్తిని పిలిచి మరీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారంటే.. ఏ స్కెచ్ మీద ఇచ్చారో చూడాల్సి ఉందన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని.. రాత్రి వరకు ఎవరైనా ఏమైనా చేసుకుంటారేమో చూడాలన్నారు. గూడు చెదిరిందంటూ..కల చెదిరందంటూ ఆశావహులు పాడుకోవాల్సిన పరిస్థితి ఉందని పార్టీ అధ్యక్ష పదవి ఆశించిన బీజేపీ నేతలనుద్దేశించి కిరణ్ కుమార్ సైటైర్లు వేశారు.

మెట్రో రెండో దశ డీపీఆర్ వారం కిందటే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తప్పబట్టారు. 2014నుంచి 24 మధ్య 20నగరాల్లో మెట్రో విస్తరణ జరిగిందని..హైదరాబాద్ మెట్రోకు ఇదే బీజేపీ కిషన్ రెడ్డి వారి ప్రభుత్వం ఉన్నా నిధులు తేలేదని విమర్శించారు. పక్క రాష్ట్రాలలోని బెంగళూరు మెట్రో ఫేస్-3కి రూ.44,000 కోట్లు, చెన్నై మెట్రో ఫేస్-2కి రూ.1.18 లక్షల కోట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. కానీ హైదరాబాద్‌కు మాత్రం మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎంపీగా, హైదరాబాద్ బిడ్డగా చెప్పుకునే కిషన్ రెడ్డి మన నగరానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారు? అని ప్రశ్నించారు. విభజన హామీలను సైతం బీజేపీ అమలు చేయడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

Exit mobile version