Mlc Result | స్థానిక ఎమ్మెల్సీలో నైతికంగా కాంగ్రెస్‌దే గెలుపు ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రి.. జూపల్లి

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ సాంకేతికంగా గెలిచినప్పటికి నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - June 2, 2024 / 05:39 PM IST

విధాత, హైదరాబాద్ : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ సాంకేతికంగా గెలిచినప్పటికి నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటమిపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 920 బీఆరెస్ ఓట్లు, 350 కాంగ్రెస్ ఓట్లు, 100 బీజేపీకి ఓట్లు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీఆరెస్‌ 763 ఓట్లు పడితే, కాంగ్రెస్‌కు 662 ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్ వాస్త బలం కంటే అధికంగా మా పార్టీకి ఓట్లు వచ్చాయన్నారు. అంటే ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందనడానికి ఇది సంకేతమని, అందుకే కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని చెబుతున్నానన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆరెస్‌ వాళ్ళు కూడా కాంగ్రెస్ కి ఓటు వేశారని గుర్తు చేశారు. 2018 ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్ లాగా మేము చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అలా చేయాలి అంటే గెలిచే వాళ్లమన్నారు. కాంగ్రెస్ కి 300 ఓట్లు అధికంగా వచ్చేవన్నారు. కాంగ్రెస్ ఆరునెలల పాలన వైఫల్యాలకు, రానున్న బీఆరెస్ విజయాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలవడం సూచికని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పార్టీ ఫిరాయింపులను బీఆరెస్ మాదిరిగా ప్రొత్సహిస్తే ఇందులో కాంగ్రెస్ విజయం సాధించేదన్నారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఫలితాలున్నాయని, విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్‌ భూస్థాపితం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం కాబోతుందన్నారు.

Latest News