Constable Suicide| తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలైన ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్ కుమార్(23) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

విధాత: ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం( online betting addiction)తో అప్పుల పాలైన ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య(constable suicide)కు పాల్పడ్డాడు. సంగారెడ్డి(Sangareddy) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్ కుమార్(23) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్ తన సోదరితో కలిసి సంగారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం ఉద్యోగంలో చేరిన సందీప్ అన్ లైన్ గేమ్స్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

కొఠారి సందీప్ కుమార్ ఆత్మహత్యపై నగర సీపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆన్ లైన్ బెట్టింగ్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన కానిస్టేబుల్.. దానికే వ్యసనపరుడై ప్రాణాలు తీసుకోవడం బాధాకరమన్నారు. జీవితంలో ఒడిదుడుకులు సహజం.. సమస్యకు చావు పరిష్కారం కాదని సజ్జనార్ స్పష్టం చేశారు.