- కాంగ్రెస్ హయాంలో అత్యంత అవినీతి
- చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు
- ప్రాజెక్టులపై అవగాహన ఉన్న కడియం శ్రీహరి మంత్రులతో ఎందుకు మాట్లాడలేదు
- మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శ
విధాత, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ హయం లోనే అత్యంత అవినీతి జరిగిందని బిఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రుల బృందం శుక్రవారం దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా వారు ప్రాజెక్టుపై ఎటువంటి అధ్యయనం చేయకుండా చిల్లర మాటలు చేస్తూ ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రాజెక్టులు, చెరువులను నీళ్లు నింపి ఆరున్నర లక్షల ఎకరాలకు దేవాదుల ద్వారా నీటిని అందించాడని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేవాదుల వ్యయం 10,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అప్పటి టిడిపి, మొన్నటి బిఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ లో కడియం శ్రీహరి ఉండి, కెసిఆర్ అపర భగీరథుడని ఒక కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినటువంటి ఘనత కేసిఆర్ కు దక్కుతుందని శ్రీహరి అన్నారని తెలిపారు. అంతేకాకుండా రూ.2100 కోట్లతో 2017 లో శంకుస్థాపన చేసి 2022లో పూర్తి చేస్తామని చెప్పారని తెలిపారు. 100 టీ ఎం సి ల నీటిని దేవాదులకు కేటాయించడం హర్షనీయమని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కడియం శ్రీహరి అన్నారని ఆ విషయాన్ని మీడియా ముఖంగా తను మాట్లాడిన వీడియోను చూపించారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉత్త మాటలే చెప్తున్నారని, ఆయన పక్కన ఉండి కూడా కడియం శ్రీహరి మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ప్రాజెక్టులపై అవగాహన ఉన్నటువంటి కడియం శ్రీహరి పార్టీలు మారొచ్చు కానీ,మాట మార్చవద్దని హితవు పలికారు.
సిగ్గు,శరం ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చెయ్
మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ వ్యవసాయం రంగం మీద, వ్యవసాయం మీద ఎటువంటి అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం సరికాదన్నారు.
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజున సగం క్యాబినెట్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
సివిల్ సప్లై లో కుంభకోణం గురించి ఆధారాలతో కూడిన ఫైల్ ను, ప్రతి నెల 1100 కోట్ల రూపాయలు నీ అనుచరులైనటువంటి టెండర్స్ లో పాల్గొన్నటువంటి వారికి,ఏ బ్యాంకులో జమవుతున్నాయో మాకు తెలుసు అని అన్నారు.ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2007 లకు రైతుల దగ్గర తీసుకొని, రూ.2230లను ప్రభుత్వం ఇస్తున్నట్టు చెబుతున్నారని, అందువల్ల ఈ డబ్బులు ఎటు పోతున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నన్నపనేని నరేందర్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సుధీర్ కుమార్, జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, నయీమ్, జోరిక రమేష్, శ్రవణ్ కుమార్, పోలేపల్లి రామ్మూర్తి, ఖలీల్, సదాంత్, రవీందర్ రావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.