Dasyam Vinay Bhaskar | పూలే సామాజిక విప్లవ పితామహుడు

  • Publish Date - April 11, 2024 / 01:55 PM IST

  • మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నేత దాస్యం విన‌య్ భాస్కర్‌

విధాత, వరంగల్ ప్రతినిధి: పూలే గొప్ప అభ్యుద‌య‌వాది, సామాజిక విప్లవ పితామహుడని మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విన‌య్ భాస్కర్ అన్నారు. మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి వేడుక‌ల‌ను గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో పులి ర‌జినీకాంత్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పూలే చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వినయ్ మాట్లాడుతూ పూలే ఆశ‌యాల‌ను కొన‌సాగిద్దామ‌ని అన్నారు. బ‌హుజ‌న వ‌ర్గాల అభ్యున్నతి కోసం పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు.

అణ‌గారిన వ‌ర్గాల‌కు విద్యనందించిన గొప్ప వ్యక్తి పూలే అంటూ కొనియాడారు. వ‌ర్ణ వ్య‌స్థపై పోరాడిన మ‌హ‌నీయుడని, అంబేద్కర్ వంటి ఎంతో మంది మ‌హ‌నీయుల‌కు స్ఫూర్తి ప్రధాత పూలే అని అన్నారు. బాలిక‌ల విద్యను ప్రోత్సహించిన గొప్ప సంఘ‌సంస్కర్త అని తెలిపారు. సామాజిక దురాచార‌ల‌పై పోరాడిన విప్లవ యోధుడని అన్నారు. పూలే జయంతి, వర్ధంతిలను కెసిఆర్ అధికారికంగా నిర్వహించారని తెలిపారు. పూలే పేరిట వందలాది గురుకుల పాఠశాలలను ప్రారంభించారని వివరించారు.

కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్లు సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, యాదవ రెడ్డి, కార్పొరేట‌ర్లు బొంగు అశోక్ యాద‌వ్‌, సోదా కిరణ్, మాజీ కార్పొరేట‌ర్లు జోరిక రమేష్, కుసుమ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, మేకల బాబు రావు, వేణు, కేశబోయిన శ్రవణ్, డివిజ‌న్ అధ్య‌క్షులు స‌దాంత్‌, మనోజ్, చందర్, చిన్నా, నాయ‌కులు కేశవ రెడ్డి, జానకి రాములు, మాలకుమ్మరి పరుశురాములు, స‌ల్వాజీ ర‌వీంద‌ర్ రావు, వీరేందర్, చాగంటి రమేష్,పానుగంటి శ్రీధర్, ముటిక రాజు, రమేష్, ర‌ఘు, వరుణ్, చందు, విద్యార్థి నాయ‌కులు గండ్ర కోట రాకేష్ యాద‌వ్‌, పబ్బోజు శ్రీకాంత్ చారి, నాయకులు పుల్లయ్య, కిరణ్, రామ్మూర్తి, బచ్చు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News