Site icon vidhaatha

Koonanneni Sambasivarao | రైతు సంక్షేమం కోసం పెద్ద పీట అభినందనీయం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదనిసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని అన్నారు. ఇక కష్ట, సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహోపేతమైన నిర్ణయమని కూనంనేని తెలిపారు. భవిష్యత్తులోనైనా విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.

Exit mobile version