విధాత, హైదరాబాద్ : సైబరాబాద్ పరిధి(Cyberabad)లో పోలీస్(Police) శాఖ ఈనెల 21,22తేదీల్లో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ ఆండ్ డ్రైవ్Weekend Drunk and Drive లో 424 మందిపై కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో 300 ద్విచక్ర వాహనదారులు, 18 ఆటోలు, 99 కార్లు, 7 హెవీ వాహనదారులు ఉన్నారు. అత్యధికంగా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 45, మేడ్చల్ స్టేషన్ పరిధిలో 44 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని ఈ సందర్బంగా సైబరాబాద్ పోలీసులు గుర్తు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో వీకెండ్ రోజుల్లో నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో సగటున 400నుంచి 500మంది పట్టుబడుతున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుంది. రోడ్డు భద్రత, ప్రయాణికులు, ప్రజల ప్రాణాల కోసం మద్యం సేవించి వాహనం నడపరాదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు.
