Site icon vidhaatha

Dipadas Munshi | బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు కోర్టు నోటీసులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు ప్రభాకర్‌కు సమన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకుని ఒకరికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపణలు చేవారు. తనపై ప్రభాకర్ అసత్య ఆరోపణలు చేశారంటూ మున్షీ నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 30వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ ప్రభాకర్‌కు నోటీసులు జారీ చేసింది.

Exit mobile version