నగరంలో పాపన్న విగ్రహం ఏర్పాటు
Deputy CM Bhatti Vikramarka | సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna) జీవితం ఇందిరమ్మ రాజ్యానికి ఆదర్శమని, ప్రజా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకుతీసుకెలుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం రవీంద్రభారతీలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ (Minister Ponnam Prabhakar) తో కలిసి భట్టి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పాపన్న గౌడ్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
Hon’ble Deputy CM Sri. Bhatti Vikramarka will Participate in Sardar Sarvai Papanna Jayanthi Celebrations https://t.co/IJnTBAxm1Q
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 18, 2024
పాపన్నగౌడ్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తామని, పాపన్న పుట్టిన సర్వాయిపేట, కిలాశపూర్‌లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి 4.70 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అలాగే పాపన్న జీవిత చరిత్రకు సంబందించి పాకెట్ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రతీ గ్రామానికి పంచి పెట్టేందుకు ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. సామన్యులనే సైనికులుగా మార్చి కోటలు బద్దలు కొట్టి బయటకి వచ్చి.. ఒక్క భువనగిరి కోటనే కాదు ఏకంగా గోల్కొండ కోటనే కైవసం చేసుకున్న సర్వాయిపాపన్న జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి విద్య కీలమన్న ఆలోచనతో ప్రభుత్వం 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, అలాగే గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రతీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని, 2 లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందిస్తామని తెలిపారు. సర్వాయి పాపన్న జీవితం మనందరికీ ఆదర్శమని, చరిత్రలో నిలిచిపోయేలా సర్వాయిపేట కోటను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో పాపన్న విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కుల వృత్తుల శిక్షణకు స్కిల్ వర్సిటీలో స్థానం ఉంటుందని పేర్కొన్నారు