హైదరాబాద్, అక్టోబర్ 13(విధాత): చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారని సీఎం కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని, లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Konda Lakshma Reddy | కొండా లక్ష్మారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం వ్యాఖ్యానించారు.
