విధాత, వరంగల్ : కడుపారా మద్యం తాగిన ఇద్దరు మందుబాబులు ఆర్టీసీ డ్రైవర్, కండకర్ ను బెదిరించడమే కాకుండా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ వారిపై దాడికి యత్నంచిన సంఘటన బుధవారం జరిగింది. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వరంగల్ లో ఇద్దరు మందుబాబులు బస్సు ఎక్కారు. ఈ ఇద్దరు నర్సంపేటలో దిగాల్సి ఉండగా దిగకపోవడంతో బస్సు ఆపి, మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని కండక్టర్ లేపారు. నిద్ర నుంచి మేల్కొన్న ఈ ఇద్దరు మందుబాబులు ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పై వీరంగం వేశారు. బస్సు బయానెట్ పై కూర్చొని నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న, మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిని, ప్రయాణికులను బెదిరించారు. ఈ ఇద్దరి వీరంగంతో బస్సులోని మిగిలిన ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. చివరికి ఇద్దరిని బస్సు దింపి వెళ్ళిపోయారు. ఈ సంఘటనను వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. నర్సంపేట లో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఇద్దరు మందుబాబులు దొంతి రాంరెడ్డి, దొంతి లక్షారెడ్డి లను నర్సంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Narsampet : మద్యంమత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ కు బెదిరింపులు
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో, మద్యం సేవించిన దొంతి రాంరెడ్డి, దొంతి లక్షారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ వారిపై దాడికి యత్నించారు.

Latest News
పాక్ మాజీ ప్రధానిని హత్య చేశారా? అసలు నిజం ఏంటంటే?
సీఐ, కానిస్టేబుల్ ఇద్దరి సస్పెండ్
అవినీతి ఆనకొండ అనుముల రేవంత్ : కేటీరామారావు
కేంద్రం కీలక నిర్ణయం.. అరుదైన ఖనిజాల సేకరణకు క్యాబినెట్ ఆమోదం
బలపడిన అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఐటీఆర్ రీఫండ్స్ ఆలస్యానికి కారణం ఏంటి?
స్కామ్‌లు, స్కీములపైనే కాంగ్రెస్ ఫోకస్.. హరీశ్ తీవ్ర ఆరోపణలు
మరో కేసులో ఐ-బొమ్మ రవికి రిమాండ్
హెచ్1బీ వీసా ఫ్రాడ్.. అమీర్‌పేట్‌లో నకిలీ సర్టిఫికెట్ల విక్రయం.. వాటితో చెన్నై కాన్సులేట్‌లో వీసాలు!
మరోసారి నందమూరి-మెగా వార్