బీజేపీ గెలుపు..మల్కాజిగిరి అభివృద్ధికి మలుపు

మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నా గెలుపు నియోజకవర్గం అభివృద్ధికి మలుపుగా నిలవబోతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్

  • Publish Date - April 25, 2024 / 07:17 PM IST

కుషాయిగూడ ఇంటింటి ప్రచారంలో ఈటల

విధాత, హైదరాబాద్‌ : మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నా గెలుపు నియోజకవర్గం అభివృద్ధికి మలుపుగా నిలవబోతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌, బేతి సుభాష్‌రెడ్డి, కార్పోరేటర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అవినీతి, కుంభకోణాలు లేకుండా ఆర్ధికంగా పురోగమించిందన్నారు. దేశం ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యలను పరిష్కసామన్న మోదీ హామీ మేరకు 370అర్టికల్ రద్దు..త్రిపుల్ తలాక్ రద్దు..మహిళా రిజర్వేషన్ బిల్లు, రామమందిర నిర్మాణం వంటి కీలక పాలన నిర్ణయాలు అమలు జరిగాయన్నారు. దేశంలో ఎలాంటి మతఘర్షణలు..ఉగ్రవాద, విదేశీ దాడులు లేకుండా భద్రత పరంగా మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. మరోసారి ప్రధానిగా మోదీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు 400స్థానాల్లో బీజేపీని గెలిపించే క్రమంలో మల్కాజిగిరిలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మల్కాజిగిరిలో గెలిచివస్తే నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. మోదీ మరోసారి ప్రధానిగా వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగనుందన్నారు. దేశంలో మోదీ పాలనలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు..నాలుగుకోట్ల ఇళ్ల నిర్మాణం, చేతి వృత్తులకు విశ్వకర్మ వంటి పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. అన్నదాతలకు మద్ధతు ధర..సమృద్ధిగా ఎరువులు, విద్యుత్తు అందించే కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు మోదీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీకి ఓటు వేసి మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేయాలని, కాంగ్రెస్‌, బీఆరెస్‌ల ప్రలోభాలకు గురైతే కేంద్రంలో అధికారంలో రాలేని ఆ పార్టీలతో నియోజకవర్గం అభివృద్ధి వెనుకబడుతుందని హెచ్చరించారు.

Latest News