Site icon vidhaatha

ఆషాడ బోనాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం.. మంత్రి తలసాని

విధాత:ఆషాడ బోనాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభ్యత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.మంగళవారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో రాంగోపాల్ పేట,మొండా మార్కెట్ డివిజన్ లకు చెందిన వివిధ ఆలయాల కమిటీ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించాలనే ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ప్రజలు కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మహంకాళి ఆలయ EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version