Site icon vidhaatha

నేటీ నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.. రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్‌ సర్వీసెస్ శాఖ ద్వారా ఫైర్ సర్వీసెస్ వీక్(అగ్నిమాపక వారోత్సవాలు) ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబడుతుందని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ ఫైర్ సర్వీసెస్ వీక్ పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో నివాస గృహాలు, పరిశ్రమలు, పాఠశాలలు, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అగ్నిప్రమాదం జరిగినా తక్షణమే 101 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీబీ కాశిరెడ్డి, హయత్ నగర్, ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు

Exit mobile version