Site icon vidhaatha

తెలంగాణ నీటిపారుదల సలహాదారుడిగా .. ఏపీ మాజీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల, నీటి వనరుల సలహాదారుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ నియామితులయ్యారు. ఈమేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై సోషల్ మీడియాలో రచ్చ నెలకొంది. గతంలో తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన వారికి తెలంగాణ నీటిపారుదల సలహాదారు పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తు కామెంట్లు పెడుతున్నారు. అదిగాక బీఆరెస్ ప్రభుత్వం రిటైర్డు అధికారులను సలహాదారులుగా, ఓఎస్డీలుగా సహా పలు పోస్టుల పేరుతో నియమించుకుని అక్రమాలకు పాల్పడిందని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తుండటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version