- అదే బాటలో మాజీ ఎమ్మెల్సీ కాటెపల్లి
విధాత : బీఆరెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ, ఢిల్లీలో బీఆరెస్ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, తన కుమారుడు మంద శ్రీనాథ్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు. శుక్రవారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌లతో కలిసి హైద్రాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.
కాగా.. తన కుమారుడికి అలంపూర్ టికెట్ కేటాయించాలని పలుమార్లు మంద జగన్నాథం సీఎం కేసీఆర్‌ను కోరినా పట్టించుకోకపోవడం, రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి ప్రాధాన్యతనిచ్చి ఆయన అనుచరుడికి బీఆరెస్ టికెట్ కేటాయించడం వంటి పరిణామాలతో అసంతృప్తికి గురైన మంద జగన్నాథం పార్టీ మారడానికి దారితీశాయి. కుమారుడు శ్రీనాథ్‌తో పాటు తను ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
మంద గతంలో మూడుసార్లు టీడీపీ, ఒక పర్యాయం కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా ఎన్నికయ్యారు. మరో మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి సైతం బీఆరెస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అలాగే బీజేపీ మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఇదే రోజు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది.