విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని తాను ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని వివరించారు.
ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని వెంకయ్య ఆకాంక్షించారు.
Venkaiah Naidu | తెలుగులో ఉత్తర్వులపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హర్షాతీరేకాలు .. ట్విటర్ వేదికగా అభినందనలు
ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

Latest News
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..