ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్(Foxconn), తను కొత్తగా తయారుచేయబోయే ఎలక్ట్రిక్ వాహన యంత్ర విడిభాగాల తయారీ, అసెంబ్లీ (mechanical components in electric vehicle) యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కర్ణాటక(Karnataka)ను ఎంపిక చేసుకుంది. ప్రాజెక్ట్ చీతా(Project Cheetah) పేరుతో నెలకొల్పబోయే ఈ ప్లాంట్ చైనా ప్లాంట్ తర్వాత అతి పెద్దది. తైవాన్ కంపెనీ హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్( Hon Hai Technology Group )కు చెందిన ఫాక్స్‌కాన్, దొడ్డబళ్లాపూర్( Doddaballapur )లో రూ.25వేల కోట్లతో ఈ ప్లాంట్ నెలకొల్పనుంది.
ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యూంగ్ లియూ(Young Liu )తో చర్చల అనంతరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah) మాట్లాడుతూ, ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌కు పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని, నీరు, విద్యుత్, రహదారుల దగ్గర్నుంచీ న్యాయసేవలు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని దేవనహళ్లి తాలూకా, దొడ్డబళ్లాపూర్ ఐటీఐఆర్ ప్రారిశ్రామిక ప్రాంతంలో ఫాక్స్‌కాన్‌కు 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 50 వేల ఉద్యోగాలు(50 Thousand Jobs) వస్తాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యూంగ్ లియూ మాట్లాడుతూ, త్వరలో ఈ ప్లాంట్, చైనాలోని ప్లాంట్ తర్వాత అతిపెద్దది(second-largest Foxconn plant after China’s unit)గా మారబోతోందని, దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. అవి కూడా ప్రత్యేకించి మధ్యస్తంగా చదువుకున్నవారికే(middle-level educated individuals)నని చెప్పిన లియూ, ఇది ఇక్కడితో ఆగదని, తాము మరిన్నిరంగాల్లోకి విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, పరస్పర విశ్వాసముంటే ఏదైనా సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
ఫాక్స్‌కాన్‌కు ఇదివరకే దొడ్డబళ్లాపూర్‌లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్(Project Elephant) పేరుతో 300 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్లాంట్ ఉంది. దాని తర్వాత ఇది రెండోది. ఈ రోజు ఫాక్సకాన్ ప్రతినిధులు తమ ప్లాంట్‌ను సందర్శించే అవకాశముంది. అక్కడ ప్లాంట్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఆశ్చర్యకరంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy), పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి, ఢిల్లీలో ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌తో సమావేశమైన(Meeting with Foxconn Chairman) మర్నాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంటే అన్నివిధాల సహాయసహకారాలందిస్తామని వారికి హామీ ఇచ్చారు. సమాధానంగా యూంగ్ లియూ కూడా తెలంగాణను సందర్శిస్తానని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. అదేరోజు బెంగళూరు వెళ్లిపోయిన ఫాక్స్‌కాన్ బృందం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశం కావడం, అది పూర్తయిన వెంటనే సిద్దరామయ్య ఫాక్స్‌కాన్ రెండో ప్లాంట్ గురించిన సమాచారాన్ని విడుదల చేసారు.
మార్చి 2, 2023న, అప్పటి తెలంగాణ ప్రభుత్వం(CM KCR)తో ఫాక్స్‌కాన్ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుని, మూడు వారాల్లోపే, మార్చి 15న కొంగరకలాన్(Kongar Kalan)లో ప్లాంట్‌కు భూమిపూజ (Groud-Breaking Ceremony)చేసింది. అక్కడ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారుచేస్తారని తెలిపింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు($500 Million) వెచ్చించిన ఫాక్స్‌కాన్, దీని ద్వారా 25వేల మంది(25 Thousand Jobs)కి ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది ఇంకా పెరుగుతాయని చెప్పింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.