GATE Coaching | ఎస్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. ‘గేట్’ కోచింగ్ ఉచితం

GATE Coaching | ఇంజినీరింగ్( Engineering ) ఫైన‌ల్ ఇయ‌ర్‌తో పాటు ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు గేట్‌( Graduate Aptitude Test in Engineering) కు ప్రిపేర్ అవుతుంటారు. అయితే గేట్‌( GATE )కు ప్రిపేర‌య్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు వ‌రంగ‌ల్ నిట్( Warangal NIT ) శుభ‌వార్త వినిపించింది.

GATE Coaching | హైద‌రాబాద్ : ఇంజినీరింగ్( Engineering ) ఫైన‌ల్ ఇయ‌ర్‌తో పాటు ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు గేట్‌( Graduate Aptitude Test in Engineering) కు ప్రిపేర్ అవుతుంటారు. అయితే గేట్‌( GATE )కు ప్రిపేర‌య్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు వ‌రంగ‌ల్ నిట్( Warangal NIT ) శుభ‌వార్త వినిపించింది.

వ‌రంగల్ నిట్‌తో పాటు స‌మీప ఇంజినీరింగ్ కాలేజీల్లో చ‌దువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ఉచిత కోచింగ్ ఎనిమిది వారాల పాటు కొన‌సాగ‌నుంది. న‌వంబ‌ర్ 17 నుంచి 2026 జ‌న‌వ‌రి 9వ తేదీ వ‌ర‌కు ఉచితంగా కోచింగ్ ఇవ్వ‌నున్నారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు వ‌రంగ‌ల్ నిట్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

కేవ‌లం శ‌నివారాల్లో మాత్ర‌మే క్లాసులు నిర్వ‌హించ‌బడుతాయి. సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు క్లాసులు కొన‌సాగుతాయి. నాలుగు క్లాసులకు హాజ‌రు కాక‌పోతే.. అడ్మిష‌న్ క్యాన్షిల్ అవుతుంది. కోచింగ్ స‌మ‌యంలో మొబైల్ ఫోన్లు నిషేధించ‌బ‌డుతాయి. త‌దిత‌ర వివ‌రాల‌కు 993169781 నంబ‌ర్‌లో సంప్ర‌దించాల‌న్నారు.

ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల్సిన ధృవ‌ప‌త్రాలు ఇవే..

ఎస్సెస్సీ మెమో
కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
కాలేజీ ఐడీ లేదా ఆధార్ కార్డు
గేట్ 2025 ద‌ర‌ఖాస్తు ఫామ్
వ‌న్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

Latest News