Musi River | హైదరాబాద్ : మూసీ నది( Musi River ) ప్రక్షాళనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితులకు అండగా ఉండేందుకు సిబ్బందిని నియమించింది. 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి( Amrapali ) ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్వాసితులను డబుల్ బెడ్రూం ఇండ్లకు హౌసింగ్ సిబ్బంది తరలించనుంది. పిల్లిగుడిసెలు, జంగమ్మెట్, ప్రతాపసింగారం, సాయిచరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు-1, గాంధీనగర్, జై భవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి పోచంపల్లి-2, బాచుపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు నిర్వాసితులను తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కేటాయించే డబుల్ బెడ్రూం ఇండ్లకు తాము వెళ్లబోమని నిర్వాసితులు తేల్చిచెబుతున్నారు. మమ్మల్ని ఇక్కడ్నుంచి తరలిస్తే.. సీఎం రేవంత్ రెడ్డికి మా ఉసురు తగుల్తదని బాధిత కుటుంబాలు శాపనార్థాలు పెడుతున్నారు.