Mega Job Mela | నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. సెప్టెంబ‌ర్ 22న హైద‌రాబాద్‌లో మెగా జాబ్ మేళా

Mega Job Mela | మీరు ప‌ది, ఇంట‌ర్, డిగ్రీ, పీజీ పాస్ అయ్యారా..? అయితే ఉద్యోగం( Jobs ) కోసం ఎదురుచూస్తున్నారా..? ఆల‌స్యం ఎందుకు.. ఈ నెల 22న హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో మెగా జాబ్ మేళా( Mega Job Mela ) నిర్వ‌హించ‌నున్నారు. ఆ జాబ్ మేళా వివ‌రాలు ఇలా..

  • Publish Date - September 19, 2025 / 08:32 AM IST

Mega Job Mela | హైద‌రాబాద్ : నిరుద్యోగుల‌కు( Un Employees ) శుభ‌వార్త‌. ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఉద్యోగాల( Jobs ) కోసం ఎదురుచూస్తున్న వారికి ప్ర‌యివేటు రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు గెలాక్సీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూష‌న్స్ ఆధ్వ‌ర్యంలో లియోనిన్ క‌న్స‌ల్టింగ్ స‌ర్వీసెస్ మెగా జాబ్ మేళా( Mega Job Mela ) నిర్వ‌హించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. ఈ జాబ్ మేళాకు హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని గేలాక్సీ క్యాంప‌స్( Galaxy Campus ) వేదిక కానుంది.

ఐటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, బీపీవో, రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ, ఇంజినీరింగ్ స‌ర్వీసెస్, సేల్స్ అండ్ మార్కెటింగ్, టీచింగ్, పారామెడిక‌ల్ రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌నున్నారు. ఇక జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే నిరుద్యోగ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ బ‌యోడేటాను తీసుకురావాల్సి ఉంటుంది. విద్యార్హ‌త స‌ర్టిఫికెట్స్, ఫొటోల‌తో పాటు అవ‌స‌ర‌మైన ధృవ‌ప‌త్రాలు వెంట తెచ్చుకోవాలి.

జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే వారికి ఈ అర్హ‌త‌లు త‌ప్ప‌నిస‌రి

ప‌దో త‌ర‌గ‌తి
ఇంట‌ర్
గ్రాడ్యుయేట్
పోస్టు గ్రాడ్యుయేట్
అభ్య‌ర్థుల అర్హ‌త‌ను బ‌ట్టి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌నున్నారు.

ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే కంపెనీలు ఇవే

ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్
బీపీవో అండ్ కస్ట‌మ‌ర్ స‌పోర్ట్
టెక్నిక‌ల్ స‌పోర్ట్ అండ్ బ్యాక్ ఆఫీస్ అసోసియేట్స్
సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్
ఫైనాన్స్, అకౌంట్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు
రిటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ ఓపెనింగ్స్
టీచింగ్ అండ్ అకాడ‌మిక్ జాబ్స్
పారామెడిక‌ల్(ల్యాబ్ టెక్నిషీయ‌న్స్, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు)