Site icon vidhaatha

MLA Raja Singh : బీజేపీ ఎప్పుడు తప్పు చేసినా ఎదురు తిరుగుతా

MLA Raja Singh

హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనని స్పష్టం చేశారు. బీజేపీలో కొంత మంది పెద్ద నాయకులు పదవి మీద ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడటం లేదని అన్నారు. కానీ తాను అలాంటి వాడిని కాదని, తన మెసేజ్ ఎప్పుడైనా కార్యకర్తలకు ఉపయోగ పడేదిలా ఉంటుందన్నారు. బీజేపీ ఎప్పుడు..ఎప్పుడు తప్పు చేస్తే అప్పడు తాను ఖచ్చితంగా ఎదురు తురుగుతానని వెల్లడించారు. గోషామాల్ ప్రజలే తనను గెలిపించారని, బీజేపీ తనకు ఏ ఎలక్షన్‌లో కూడా సపోర్ట్ చేయలేదని తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Exit mobile version