Site icon vidhaatha

Bandla Krishnamohan Reddy | సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల

విధాత, హైదరాబాద్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ నుంచి గెలిచిన బండ్ల జూలై 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే తాజాగా ఆయన అసెంబ్లీ హాల్‌లో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో ఆయన మళ్లీ బీఆరెస్‌లో చేరుతారన్న కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బండ్ల నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం తన పార్టీ మార్పు కథనాలను కొట్టేసిన బండ్ల తాను కాంగ్రెస్‌లో కొనసాగనున్నట్లుగా ప్రకటించారు. ఈ రోజు బండ్లను వెంట తీసుకుని మంత్రి జూపల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. బండ్ల వెంట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు.

Exit mobile version