Gunman suicide attempt| హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మాహత్యా యత్నం చేసుకోవడం కలకలం రేపింది. హయత్ నగర్ లోని తన ఇంటిలో గన్ తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

విధాత, హైదరాబాద్ : హైడ్రా కమిషనర్( HYDRA Commissioner) రంగనాథ్( Ranganath) గన్ మెన్(Gunman) కృష్ణ చైతన్య( Krishna Chaitanya) ఆత్మాహత్యా యత్నం( Suicide Attempt) చేసుకోవడం కలకలం రేపింది. హయత్ నగర్ లోని తన ఇంటిలో గన్ తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్స్ కి బానిసై భారీగా నష్టపోయినట్లుగా సమాచారం. దీంతో భారీగా అప్పులు, ఆర్థిక సమస్యల పెరిగిపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తుంది.

Latest News