Site icon vidhaatha

Gutta Sukender Reddy | నల్లగొండ ప్రాజెక్టుల పట్ల బీఆరెస్ నిర్లక్ష్యం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

సుంకిశాల పథకం అనవసరం..ఎస్‌ఎల్బీసీతోనే శాశ్వత పరిష్కారం
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వం గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను ముఖ్యంగా నల్లగొండ జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ, మహబూనగర్ పరిధిలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్‌రెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేసి, ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగుతాగునీటి అవసరాలకు ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పూర్తవ్వడం ఒక్కటే శాశ్వత పరిష్కారమన్నారు. బీఆరెస్ చేపట్టిన సుంకిశాల అవసరం లేని సాగునీటి పధకమన్నారు. సుంకిశాల పథకాన్ని నేను ఆనాడే వ్యతిరేకించానన్నారు. సుంకిశాల కోసం పెట్టిన ఖర్చు ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టుకు పెట్టి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు, ప్రజలకు మేలు జరిగేదన్నారు. ఏఎమ్మార్పీ పథకం అంచనాలకు మించి గొప్పగా పనిచేస్తుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమన్నారు.

Exit mobile version