Site icon vidhaatha

Nalgonda | ఉమ్మడి నల్లగొండలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు.. పతాకావిష్కరణ చేసిన కోమటిరెడ్డి, ఉత్తమ్‌, గుత్తాలు

Nalgonda | దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ( Independence Day celebrations) ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో మువ్వన్నెల పతకావిష్కరణలు జోరుగా సాగాయి. నల్లగొండ పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు.

సూర్యాపేటలో ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy), యాదాద్రి భువనగిరిలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy)లు జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆయా కార్యక్రమాల్లో ఆ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Exit mobile version