Site icon vidhaatha

Gutha Sukender Reddy | సమృద్ధిగా వానలు కురవాలి.. పంటలు పండాలి: మండలి చైర్మన్ గుత్తా

విధాత, హైదరాబాద్ : గురుపూర్ణిమ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పట్టణం శివాజీ నగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి బాబా, చిట్యాల మండలం వట్టిమర్తి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ” ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని గురుపూర్ణిమ సందర్భంగా సాయిబాబాను ప్రార్ధించినట్లు తెలిపారు. వానలు సంవృధ్దిగా పడి పంటలు పుష్కలంగా పండలని బాబాను కోరుకున్నట్గుగా తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెంది ఆనందంగా జీవించాలని ఆయన చెప్పారు. ఎలాంటి విపత్తులు రాకుండా ఏళ్ల వేళలా ప్రజలకు రక్షణగా సాయిబాబా ఉండాలని కోరారు.

Exit mobile version