Harish Rao : జర్నలిస్టుల అరెస్టుపై హరీష్ రావు ఫైర్

జర్నలిస్టుల అరెస్టులను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సింగరేణి నిధులతో ఫుట్ బాల్ సోకులు ఏంటని ప్రశ్నిస్తూ, "సింగరేణి పైసలు నీ అయ్య సొత్తా?" అని సీఎం రేవంత్‌పై మండిపడ్డారు.

Harish Rao

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని.. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి సీఎండిని కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ పాలసీని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని హరీష్ రావు మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రశ్నించేవారినిఅరెస్ట్ చేస్తుందని.. ఉక్కు పాదంతో అణిచివేస్తుందన్నారు. జర్నలిస్టులకు ధర్నా చేసే హక్కు లేదా, దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా..? ఇదేనా మీరు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా రేవంత్ పోల్చడం దారుణం అన్నారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు.

జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వంలో 26,000 అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు అని, రిపోర్టింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు అని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ మేము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్రిడిటేషన్ కార్డులను 10 వేలకు తగ్గిస్తామని చెప్పడం దుర్మార్గం అని హరీష్ రావు తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హరీష్ రావు తెలిపారు.

సింగరేణి పైసలు నీ అయ్య సొత్తా??

సింగరేణి సంస్థ రూ.10కోట్లతో ఫుట్ బాల్ ఆడటానికి అవేమైనా. నీ అయ్య సొత్తా? అని రేవంత్ రెడ్డి పై హరీష్ రావు మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధులు సరిపోతలేవు అంటే వాటితో నువ్వు ఫుట్ బాల్ ఆడతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు గానీ.. మెస్సితో ఫుట్ బాల్ ఆడటానికి.. నీ సోకులకు పైసలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రేపు మేం అధికారంలోకి వచ్చాక ఈ సింగరేణి నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపిస్తాం అన్నారు. గతంలో మేం సింగరేణి నిధులను మంచినీటి వసతి, విద్యకు ఖర్చు చేశామని..రేవంత్ రెడ్డి మాత్రం ఫుట్ బాల్ సోకు కోసం దుర్వినియోగం చేశారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

Naga Babu | మ‌హిళ‌లు మీకు న‌చ్చిన దుస్తులు వేసుకోండి.. చర్చకు దారి తీసిన నాగబాబు స్టేట్‌మెంట్
Boxing Day Test : బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం

Latest News