Site icon vidhaatha

Rains | హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌.. త‌డిసి ముద్దైన భాగ్య‌న‌గ‌రం

Rains | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున భారీ వ‌ర్షం కురిసింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు వాన దంచికొట్టింది. మూడు గంట‌ల పాటు కుండ‌పోత‌గా కురిసిన వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం త‌డిసి ముద్దైంది.

భారీ వ‌ర్షం కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ప‌లు కాల‌నీల్లో మోకాళ్ల లోతు వ‌ర‌ద నీరు రావ‌డంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, లక్డీకపూల్‌, నాంపల్లి, అడిబ్స్‌, కోఠి, యూసుఫ్‌గూడ, పటాన్‌చెరూ, మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, భరత్‌నగర్‌, బాలానగర్‌, బోయిన్‌పల్లి, బేగంపేట, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌, నాచారం, ఉప్పల్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, కుషాయిగూడ, చంగిచర్ల, నారపల్లి, నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి, హస్తినాపురంలో భారీ వ‌ర్షం కురిసింది.

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అకడకకడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Exit mobile version