Site icon vidhaatha

తెలంగాణలో భారీ వర్షాలు.. పలువురు గల్లంతు

విధాత: తెలంగాణ లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లా, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉప్పొంగిన వాగులు జన జీవనాన్ని అవతలకుతలం చేస్తున్నాయి. మానేరు.. మంజీరా నదులు, వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నక్క వాగులో కారు కొట్టుకపోవడంతో అందులోని నలుగురు గల్లంతయ్యారు. మానేరు జలాశయం వరదలలో నాగయ్య అనే పశువుల కాపరి కొట్టుకుపోయి మృతి చెందగా.. మరో ఐదుగురు వాగులో చిక్కుకున్నారు . బొగ్గు గుడిసే వాగు ఉధృతిలో బ్రిడ్జి నిర్మాణం కోసం పని చేస్తున్న 9 మంది కార్మికులు వరదలో చిక్కుకోగా వారు వాటర్ ట్యాంక్ పైకి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో ఐదుగురిని కాపాడిన సహాయక బృందాలు మరో నలుగురిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కామారెడ్డి హైదరాబాద్ మార్గంలోని రహదారి మీదుగా వరద ఉధృతి కొనసాగుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంసాగర్ 16 గేట్లు అయితే నీటి విడుదల విడుదల చేస్తున్నా.రు సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. మెదక్ హవేలీ ఘనపూర్ మండలంలో తిమ్మాయిపల్లి నాగపూర్ వాడి గ్రామాలను వరద ముంచెత్తడంతో ఇల్లా మధ్యగా వరద నీరు ప్రవహిస్తుంది. పిల్లి కొట్టాల్లో సబ్ స్టేషన్ నీట మునిగింది. దీంతో మెదక్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ధూప్ సింగ్ తండాని వరద ముంచెత్తడంతో తండావాసులు భవనాల పైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. నడిపి తండా సేఫ్ శంకర్ తండా ఎల్లాపూర్ తండా లేత మామిడి తండా గుడి తండా వాసులు వరద లతో నిరాశ్రయులయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కామారెడ్డి కుర్తి మండలం లో వరద రోడ్డు బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తుంది. రాజీపేట తండా వాగు వరద ఉధృతిలో ఆటో కొట్టుకు పోయింది. ఆటోలోని ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రామాయంపేటలో మహిళా డిగ్రీ కళాశాల భవనం వరదలలో చిక్కుకోవడంతో అందులోని 300 మంది విద్యార్థులు సురక్షితంగా ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. మెదక్ శివారులోని పుష్పాల వాగు వరద ఉధృతితో రాయిని పెళ్లి చెరువు పొంగడంతో మెదక్ భూపతిపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి బిక్కనూరు మండలం తలమట్ల వద్ద రైలు పట్టాలపై వరద నీరు కారణంతో ఈ మార్గంలో 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగు రైళ్లలో దారి మళ్ళించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని… ఎస్ డీ ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల సాయంతో చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సిద్దిపేట యాదాద్రి భువనగిరి జనగామ హనుమకొండ వరంగల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.

Exit mobile version