Site icon vidhaatha

Heavy Rains | రాబోయే 4 రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఆ నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ..!

Heavy Rains | హైద‌రాబాద్ : రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దాని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి కళింగపట్నం మీదుగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే 2, 3 రోజుల్లో బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

శుక్ర‌, శ‌నివారాల్లో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..

అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

 

Exit mobile version