Site icon vidhaatha

దళితబంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

విధాత: హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version