Site icon vidhaatha

High Security Registration Plate | హై సెక్యూరిటీ నంబ‌ర్ ప్లేట్ పొందడం చాలా ఈజీ.. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఇలా..!

High Security Registration Plate | మీకు టూ వీల‌ర్.. త్రీ వీల‌ర్.. ఫోర్ వీల‌ర్.. క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌ను( Vehicles ) క‌లిగి ఉన్నారా..? ఈ వాహ‌నాలు అన్నీ 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు కొనుగోలు చేశారా..? అయితే ఆ వాహ‌నాల‌కు త‌ప్ప‌నిస‌రిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేష‌న్ ప్లేట్( High Security Registration Plate ) బిగించుకోవాల్సిందే. పాత వాహనాలకూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్( HSRP ) నిబంధనను అమలు చేయాలని రవాణా శాఖ( Transport Department ) నిర్ణయించింది. ఈ హై సెక్యూరిటీ నంబ‌ర్ ప్లేట్‌( Number Plate )ను సెప్టెంబరు 30వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది. అప్ప‌టి వ‌ర‌కు కూడా హై సెక్యూరిటీ నంబ‌ర్ ప్లేట్( High Security Number Plate ) బిగించుకోక‌పోతే భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ర‌వాణా శాఖ హెచ్చ‌రిస్తోంది. సెప్టెంబ‌ర్ 30 త‌ర్వాత విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించి.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేష‌న్ ప్లేట్ లేని వాహ‌నాలను సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రిస్తోంది ర‌వాణా శాఖ‌.

ఇక హై సెక్యూరిటీ రిజిస్ట్రేష‌న్ ప్లేట్ కోసం ర‌వాణా శాఖ ధ‌ర‌ల‌ను కూడా ఖ‌రారు చేసింది. వాహన రకాన్ని బట్టి కనిష్టంగా రూ.320 నుంచి గరిష్ఠంగా రూ.800గా ఈ ఛార్జీలను రవాణా శాఖ నిర్ణయించింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు, రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు( Supreme Court ) ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గెజిట్ నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. ఇక 2019 ఏప్రిల్ 1వ తేదీ త‌ర్వాత త‌యారవుతున్న వాహ‌నాల‌కు హై సెక్యూరిటీ రిజిస్ట్రేష‌న్ ప్లేట్( high security registration plate ) నిబంధ‌న ఇప్ప‌టికే అమ‌ల‌వుతుంది. మ‌రి హై సెక్యూరిటీ రిజిస్ట్రేష‌న్ ప్లేట్ పొందడం చాలా ఈజీ.. ఆన్‌లైన్ ద్వారానే ఈ నంబ‌ర్ ప్లేట్‌ను పొందొచ్చు. మ‌రి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎలా ఉందో చూద్దాం.

రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఇలా.. ( HSRP Registration )

బుకింగ్ డిటెయిల్స్ పేరుతో మ‌రో విండో ఓపెన్..

బుకింగ్ డిటెయిల్స్ పేరుతో మ‌రో విండో ఓపెన్ అవుతుంది. బుకింగ్ డిటెయిల్స్‌లో భాగంగా వెహికిల్ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్( Vehicle Registration Number ), చేసిస్ నంబ‌ర్( Chassis Number ), ఇంజిన్ నంబ‌ర్( Engine Number ) న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత క్యాప్చను ఎంట‌ర్ చేసి.. క్లిక్ హియ‌ర్ అనే బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. అనంత‌రం మ‌రిన్ని డిటెయిల్స్ వ‌స్తాయి. ఇక కాంటాక్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్‌లో భాగంగా ఓన‌ర్ నేమ్( Owner Name ), మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్, బిల్లింగ్ అడ్ర‌స్ ఇవ్వాలి. అనంత‌రం నెక్స్‌ట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని ఎంట‌ర్ చేయ‌గానే.. హోమ్ డెలివ‌రీనా..? డీల‌ర్ అపాయింట్‌మెంట్( Dealer Appointment ) అనే రెండు ఆప్ష‌న్లు వ‌స్తాయి. ఇది ఫిట్‌మెంట్‌ లొకేషన్ సర్వీస్‌ సెంటర్‌.

ఒక వేళ డీల‌ర్ అపాయింట్‌మెంట్ మీద క్లిక్ చేస్తే..

ఒక వేళ డీల‌ర్ అపాయింట్‌మెంట్ మీద క్లిక్ చేస్తే.. మ‌న వెహికిల్ కంపెనీకి సంబంధించిన డీల‌ర్ల వివ‌రాలు వస్తాయి. మ‌న‌కు ద‌గ్గ‌రున్న డీల‌ర్‌ను ఎంచుకుని.. తేదీ, స‌మ‌యాన్ని నిర్ధార‌ణ చేసుకోవాలి. అనంత‌రం క‌న్ఫ‌ర్మ్, ప్రోసిడ్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు బుకింగ్ స‌మ్మ‌రి( Booking Summary ) వ‌స్తుంది. దాంట్లో మ‌న డిటెయిల్స్ స‌రిగ్గా ఉంటే.. మ‌ళ్లీ క‌న్ఫ‌ర్మ్, ప్రోసిడ్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. మ‌రోసారి మ‌న మొబైల్ నంబ‌ర్ న‌మోదు చేసి.. ఆన్‌లైన్‌లో డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

అపాయింట్‌మెంట్‌ రోజు ఆర్సీ త‌ప్ప‌నిస‌రి..

డబ్బులు చెల్లించిన తర్వాత వివరాలు చెక్‌ చేసుకొని.. ఆప్లికేషన్‌ ప్రింట్ తీసుకోవాలి. సంబంధిత సర్వీస్‌ సెంటర్‌ వివరాలు, ఫోన్‌ నంబర్ అందులో ఉంటాయి. ఇక అపాయింట్‌మెంట్‌ రోజు త‌ప్ప‌నిస‌రిగా ఆర్సీ( Registration Certificate ) కాపీని వెంట తీసుకెళ్లాలి. నంబ‌ర్ ప్లేట్( Number Plate ) ఫిట్‌మెంట్‌కు ఎక్స్‌ట్రా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏవైనా అభ్యంతరాలుంటే 8929722201 నంబర్‌, ఈమెయిల్‌ : online@bookmyhsrp.comలో సంప్రదించొచ్చు.

Exit mobile version