Site icon vidhaatha

ఎన్నికల వేళ ఆర్టీసీ ఖజానా కళకళ.. రెండు రోజుల్లో 39.22కోట్ల ఆదాయం

విధాత: తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు టీఎస్‌ఆర్టీసీకి ఆదాయ వనరుగా నిలిచాయి. ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అదనపు బస్సులు తిప్పడంతో పోలింగ్‌ రోజు, తర్వాత రోజున మొత్తం 39.22కోట్ల ఆదాయం సమకూరింది. ఎన్నికల సమయంలో 3,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్‌కు దాదాపు వెయ్యికి పైగా బస్సులను నడిపించింది.

జేబీఎస్​, ఎంబీబీఎస్​ వంటి ప్రధాన బస్టాండ్​లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించింది. పోలింగ్‌ రోజు ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించగా, తద్వారా సంస్థకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. పోలింగ్‌ మరుసటి రోజు 14వ తేదీన 54 లక్షల మంది ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం రూ.15 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. ఇందులో మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version