Site icon vidhaatha

HYDERABAD | నిండు కుండలా మారిన హుస్సేన్‌ సాగర్‌

విధాత, హైదరాబాద్ : | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మత్తడి మీదుగా వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతుంది. సాగర్ జల సోయగాలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్‌) 514.75 మీటర్లుకాగా ప్రస్తుతం 513.23 మీటర్ల నీటి మట్టం నమోదైంది. వరద ప్రవాహం పెరిగితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

Exit mobile version