Site icon vidhaatha

Temparature | రాష్ట్రంలో రెండు రోజులపాటు వడగాలులు.. అదే సమయంలో తేలికపాటి వానలు..!

Temparature : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల రెండు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

శనివారం ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

బుధవారం మన్నార్‌ గల్ఫ్‌ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి.. గురువారం కోమరిన్‌ ప్రాంతం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version