IAS స్మితా సబర్వాల్‌ ఆ.. రూ.15లక్షలు తిరిగి కట్టాలి: బక్క జడ్సన్‌

హైకోర్టు తీర్పును పాటించాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శికి లేఖ విధాత: తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పరువు నష్టం దావా వేసేందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారంటూ 2015లో ఔట్‌ లుక్‌ మ్యాగజీన్‌పై స్మితా సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజుల నిమిత్తం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసింది. అయితే […]

  • Publish Date - April 5, 2023 / 05:43 PM IST

హైకోర్టు తీర్పును పాటించాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శికి లేఖ

విధాత: తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పరువు నష్టం దావా వేసేందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారంటూ 2015లో ఔట్‌ లుక్‌ మ్యాగజీన్‌పై స్మితా సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజుల నిమిత్తం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయంపై ఔట్ లుక్‌తో పాటు మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఐఏఎస్ అధికారి వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. స్మితా సబర్వాల్కు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదని పేర్కొన్న హైకోర్టు.. రూ.15లక్షల మొత్తాన్ని 90 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆమెను ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయం అసమంజసంగా ఉందని ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయ పడింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Latest News