Bakka Judson | బసవతారకం వెళ్లారు సరే.. ఉస్మానియా, గాంధీలకు కూడా వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంకు హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్‌ బహిష్కృత నేత బక్క జడ్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - June 23, 2024 / 03:23 PM IST

సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ బహిష్కృత నేత బక్క జడ్సన్‌ డిమాండ్‌

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంకు హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్‌ బహిష్కృత నేత బక్క జడ్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రికి రేవంత్‌రెడ్డి వెళ్లడం తప్పుకాదని, అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచిన ఈరోజు వరకు గాంధీ, ఉస్మానియా సహా ప్రభుత్వ ఆసుపత్రులను ఒక్కసారైనా ఎందుకు సందర్శించలేకపోయారని నిలదీశారు. పేదలు చికిత్సం పొందే ఆ దవాఖానాల్లో ఎలాంటి వసుతులు ఉన్నాయి..మందులు అందిసున్నారా, శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది ఎందుకు చూడలేదన్నదే మా ఆవేదన అని జడ్సన్‌ అన్నారు. టీడీపీ ట్రస్టు మాదిరిగా నడుస్తున్నటువంటి బసవతారకం ఆసుపత్రి పట్ల ఉన్న శ్రద్ధ పేదల ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల కూడా చూపించాలి కదా అన్నారు.

వరంగల్‌ ఎంజీ అసుపత్రిలో ఆరు గంటలు కరెంటు లేక రోగులు, వైద్యులు ఇబ్బంది పడితే తూతుమంత్రం విచారణ తప్ప చర్యలు లేవన్నారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రులు వెంటిలేటర్లపైన ఉన్నాయని, సిబ్బంది కొరతతో రోగులను బంధువులే మోసుకెలుతున్నదుస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అంతా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ వైద్యులు, సిబ్బందినే ఉన్నారన్నారు. తాజాగా మంత్రి దామోదరం రాజనరసింహ ఉస్మానియా ఆసుపత్రి వెళ్లి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని, వాటిని పూర్తి చేసి, ఆయన చెప్పినట్లుగా కొత్త ఆసుపత్రి భవనం, సిబ్బంది నియామకం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Latest News