Site icon vidhaatha

Academic Calendar | 2025 – 26 అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. ద‌స‌రా సెల‌వులు 8 రోజులే..!

Academic Calendar | హైద‌రాబాద్ : 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి( Academic Year ) సంబంధించి తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు( Intermediate Board ) అకాడ‌మిక్ క్యాలెండ‌ర్‌( Academic Calendar ) ను విడుద‌ల చేసింది. ఇంట‌ర్ కాలేజీల( Inter Colleges ) ప‌ని దినాల‌తో పాటు ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌, సెల‌వుల( Holidays ) వివ‌రాల‌ను ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది.

2025 జూన్ 2వ తేదీన ఇంట‌ర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి మొత్తం 226 ప‌ని దినాల‌ను డిసైడ్ చేసింది ఇంట‌ర్ బోర్డు. 2025 సెప్టెంబ‌ర్ 28 నుంచి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 10 నుంచి 15 వ‌ర‌కు హాఫ్ ఇయ‌ర్లీ ఎగ్జామినేష‌న్స్ నిర్వ‌హించ‌నున్నారు. 2026 జ‌న‌వ‌రి 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి పండుగ‌కు సెల‌వులు ఇవ్వ‌నున్నారు. జ‌న‌వ‌రి 19 నుంచి 24 వ‌ర‌కు ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ కండ‌క్ట్ చేయ‌నున్నారు. మార్చి ఫ‌స్ట్ వీక్‌లో ఇంట‌ర్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక 2025-26 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి చివ‌రి వ‌ర్కింగ్ డే మార్చి 21. ఏప్రిల్ 1 నుంచి మే 31 వ‌ర‌కు స‌మ్మ‌ర్ హాలిడేస్ ప్ర‌క‌టించారు.

Exit mobile version