Jaggareddy | రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినా వినను.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగ్గారెడ్డి (Jagga Reddy) పేరు తెలియని వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో ఆయన ఏం మాట్లాడిన సంచలనంగా మారుతుంది.

Jagga Reddy

విధాత, హైదరాబాద్ :

జగ్గారెడ్డి (Jagga Reddy) పేరు తెలియని వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో ఆయన ఏం మాట్లాడిన సంచలనంగా మారుతుంది. కాగా, తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని షాకింగ్ గురి చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కానీ, ఆయన తన భార్య నిర్మలను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినా వినని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అయితే, ఎమ్మెల్యేగా పోటీ చేయను అని నిర్ణయం తీసుకున్న జగ్గారెడ్డి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

 

Latest News