విధాత, వరంగల్ ప్రతినిధి:కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. యోగి రెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండ తన కార్యాలయంలో కూతురుతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలకు శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం యోగి రెడ్డి, ఆయన కూతురు ఆధ్య (10) మృత దేహాలను హనుమకొండలోని ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం నుండి ప్రెస్ క్లబ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి జర్నలిస్టు యోగి రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగి రెడ్డి, ఆద్య మృతదేహాలపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అకాల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా అంత్యక్రియల కోసం జనగామకు తరలించారు. జర్నలిస్టులతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Journalist Yogi Reddy | యోగిరెడ్డికి జర్నలిస్టుల కన్నీటి నివాళి.. భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు
కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు, తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగి రెడ్డికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు.

Latest News
కింగ్ కోబ్రా తిరిగి అడవిలోకి!
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం
బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత.. 650 ఎకరాల భూముల స్వాధీనం!
శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల