Jubilee Hills By Poll Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.. మ‌. 2 గంట‌ల‌కు తుది ఫ‌లితం

Jubilee Hills By Poll Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. యూసుఫ్‌గూడ‌లోని కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది.

Jubilee Hills By Poll Counting | హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. యూసుఫ్‌గూడ‌లోని కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. మొద‌ట పోస్ట‌ల బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. ఆ త‌ర్వాత ఈవీఎంల‌ను లెక్కించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యానికి తుది ఫ‌లితం వెలువ‌డ‌నుంది. ఓట్ల లెక్కింపు నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 144 సెక్ష‌న్ విధించారు.

మొత్తం 10 రౌండ్లు.. ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాలు..

ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 58 మంది అభ్య‌ర్థులు పోటీ చేశారు. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్ల‌లో ఉప ఎన్నిక ఫ‌లితం వెలువ‌డ‌నుంది. అభ్య‌ర్థులు అధిక సంఖ్య‌లో ఉండ‌డంతో ఒక్కో రౌండ్‌కు 40 నిమిషాల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. మొత్తానికి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తుది ఫ‌లితం వెలువ‌డ‌నుంద‌ని పేర్కొన్నారు.

ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో 4 లక్షల 13 వందల 65 మంది ఓటర్లకు గానూ, కేవలం 1,94,631 మంది మాత్రమే ఓటు వేశారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఫలితాల వేళ ఆయా పార్టీలు, వారి అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆర్వీ కర్ణన్‌ కోరారు.