విధాత : తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లుగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ మేరకు హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, నీట్‌లో 15 శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలని, ఆసుపత్రిలలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు పర్చాలని, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది.