సమ్మె విరమించిన జూడాలు.. నిధులు మంజూరీ చేస్తూ జీవోలు

జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో జూడాలు సమ్మె విరమించారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది

  • Publish Date - June 26, 2024 / 05:25 PM IST

విధాత, హైదరాబాద్‌ : జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో జూడాలు సమ్మె విరమించారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది.

కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ మరో జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

Latest News