Site icon vidhaatha

TELANGANA | విద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్‌గా జస్టిస్ మధన్ బీ లోకూర్‌ … ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

విధాత, హైదరాబాద్ : చత్తీస్‌ఘడ్ రాష్ట్రంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలకు సంబంధించి విచారణ చేస్తున్నవిద్యుత్తు కమిషన్ నూతన చైర్మన్‌గా జస్టిస్ మధన్ బీ లోకూర్ నియామితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహారశైలీపై అభ్యంతరం తెలుపుతూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ విచారించారు. కమిషన్ చైర్మన్‌గా నరసింహారెడ్డి విచారణ అంశాలపై ప్రెస్‌మీట్ పెట్టడాన్ని తప్పుబడుతూ నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. అదే సమయంలో కమిషన్‌ విచారణ కొనసాగించుకోవచ్చని సీజేఐ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. దీంతో నరసింహారెడ్డి స్వచ్చందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. నరసింహారెడ్డి స్థానంలో నియామితులైన జస్టిస్ మధన్ బీ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్‌గా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

Exit mobile version