విధాత : చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని ఆరోపించారు. విచారణ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు హాజరుకాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి అభాండాలు వేశారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే పవర్ కమిషన్ నుంచి జస్టిస్ నర్సింహా రెడ్డి స్వచ్ఛదంగా వైదొలగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు కేసీఆర్ సైతం పవర్ కమిషన్ నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని డిమాండ్ చేయగా, హరీశ్‌రావు ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలకు మద్ధతుగా అదే డిమాండ్‌ను వినిపించారు. విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సైతం కేసీఆర్ డిమాండ్‌తో ఇప్పటికే ఏకీభవించడం జరిగింది.
కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలగాలి … మాజీ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్
చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఫైర్ అయ్యారు

Latest News
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం